ఉ.
నేటిన మంచివారివలె నీటినరాతలురాయుకొందరున్
మేటికిసాధ్యమాయెననిమిక్కిలి సంతసమొందుచుందురే
కోటికి లెక్కలేనివగు గోప్యత గూడినసత్య వాక్కులన్
దాటిగ పంచుకొంటు శివ తైలపు మాటలు వెల్లడింతురే
ఉ.
నేటికిపాట్లుతెప్పలని నిన్ను బజింతురు నీలకందరా!
మేటిగ జాలిచూపమని మిక్కిలి వేడిరిబోళశంకరా!
కోటికి పెక్కుమీరగను కోర్కెలు కోరిరటంచు కోపమా
దాటికి తాళలేము శివ దైవమునీవని నమ్మినారమే
ఉ.
నేటికి పాలుపోదు కద నీవు రచించిన సంఘరీతి నీ
మేటిగ కూర్చినావు శివ మీగడ బంధపు బంధనాలతో
కోటికి సాటిరావనుచు కొండల మధ్యన దాగుటెందుకో
దాటికి దారమేర్పరిచి దైవము దిక్కని నమ్మమందువే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి