అంశం:- (కాంత కాంతి భ్రాంతి శాంతి) పదాలతో పద్యాలు ఐచ్ఛికాంశం:-మమత ఐలహైదరాబాద్924759343

 ఉ.
కాంతలు చంద్రకాంతివలె కాంచనమై నడయాడెటింటిలో
కాంతులశోభలేనుమరి కంటికి చెమ్మనుకూర్చధర్మమా
భ్రాంతికి లోనుగాక తన బాధ్యతమీరగ సేవజేయునే
శాంతిని కూర్చుమెల్లపుడు శారద చిహ్నపు శాంభవే తనున్
ఉ.
కాంతకు వింతలేను మరి కంటికి కానని చోద్యమంతయున్
కాంతికి రూపమీమె కద కాగడమాదిరి చిమ్ము వెల్గులన్
భ్రాంతిన ముంచుమద్యముకు బానిసగాకుముజీవితంబునన్
శాంతికిదూరమౌను సతి సఖ్యతవీడక చూపువింతలన్
ఉ.
భ్రాంతితొ భామలందరిని భారముగా తలపోయనేలనో!
కాంతల భూషణమ్మనిన కాంచన మేనని తేల్చబోకుమా!
శాంతిని కూడగట్టుకొని సౌమ్యముగాసరిదిద్దుమెప్పుడున్
కాంతిని పంచునింతి తన కాలము చెల్లెడిదాక వీడకన్

కామెంట్‌లు