దత్తపది:-{మట్టి చెట్టు పుట్ట గుట్ట} పదాలతో పద్యాలు:-మమత ఐల-హైదరాబాద్-9247593432

 ఉ.
మట్టిని దున్నమంచు శివ మందిర మందున నున్ననందినే
చెట్టుకు మిన్నగా జనులసేవలు జేయుమటంచు పంపెనా
పుట్టిన జన్మలోన వృషభుండను కీర్తినరైతుసన్నిధిన్
గుట్టల ధాన్యరాసులకు కొట్టము నందువసించి దున్నునే
ఉ.
మట్టినపుట్టినట్టి పలు మాన్యపుజీవులచేతులందునన్
చెట్టొక ప్రాణమై నిలచి చేరినచిత్తడి నంత తుంచునే
పుట్టలు పెట్టుపాములకు పువ్వుల వాసనలందజేయుచున్
గుట్టల ప్రాణవాయువుతొ గుత్తుల కాయలనిచ్చు వృక్షముల్

కామెంట్‌లు