పద్యాలు:-మమత ఐల-హైదరాబాద్-9247593432

  కం
మనసాత్మీయులదైనచొ
మననముకాశించరెపుడు మనసెరుగుదురే
జనమందున నున్నపుడే
మనమను సంతసము నిండ మననంబేలన్
 కం
ఆస్తుల విలువలనెంచెడి
నాస్తిక జనజిహ్వలెపుడు నటనకు ధీటై 
కుస్తికి పీఠమునేయుచు
నేస్తము వలెచూడరెపుడు నిక్కము మనసా!
కామెంట్‌లు