మురళీకి చిన్నప్పటినుండి జంతు ప్రేమ ఎక్కువ.కుక్కలు,పిల్లులు,పక్షులు ఒకటేమిటి అన్ని జీవాలను ప్రేమంచేవాడు,వాటికి గడ్డి,పక్షులకు గింజలు,కోతులకు అరటి పండ్లు పెట్టేవాడు.అయినా తన చదువును నిర్లక్ష్యం చేయకుండా శ్రద్దగా చదివే వాడు.
అందుకే మురళీకి ఎమ్.బి.బి.ఎస్ లో సీటు వచ్చినా చేరకుండా,వెటనరరీ బి.ఎస్సీ లో చేరి జంతు డాక్టర్ గా స్థిర పడ్డాడు.
ఎంతో మనసు పెట్టి జబ్బున పడిన జంతువులకు, దెబ్బలు తగిలిన జంతువులకు చికిత్స చేసి వాటికి స్వస్థత చేకూర్చేవాడు.అందుకే మురళి ఇంటి దగ్గర ఉన్న చెట్టు మీద కోతి, వీధిలో కుక్క,గోడ మీద పిల్లికి మురళీ అంటే ఎంతో ఇష్టం...ఎందుకంటే ఎంతో బాధ పడుతున్న జంతువులను తీసుకొచ్చిన వారు సంతోషంతో ఆ బాధ పడిన జంతువులను తీసుక వెళ్తున్నప్పడే మురళికి జంతువుల మీద ఉన్న ప్రేమ వాటికి అర్థం అయింది.అందుకే వాటికి మురళీ అంటే ఎంతో ఇష్టం.
ఒకరోజు బాగా నీరసించి జ్వరంతో ఉన్న కుక్కను ఓ వ్యక్తి మురళి దగ్గరకు తెచ్చాడు.దానికి ఎన్నో మందులు ఇచ్చినా కోలుకో లేదు!ఇక లాభం లేదని కొన్ని మూలికా గ్రంథాలు పరిశీలించి ఊరికి పక్కనున్న చిట్టడివిలో ఆ మూలికలు వెతక సాగాడు. కొన్ని మూలికలు దొరికాయి ఒక్కటి మటుకు దొరకలేదు.
ఇదంతా ఆసుపత్రి చెట్టు మీదున్న కోతి గమనించింది.దానికి కొన్ని మూలికలు తెలుసు కానీ మురళీకి కావలసిన మూలిక ఏమిటో తెలియదు! అది గబ గబా మరికొంత దూరం వెళ్ళి బోలెడు రకాల మూలికలు తెంపుకొచ్చి మురళి ఆసుపత్రిలో పడవేసింది!
ఆ మూలికల్లో మురళికి కావల్సిన మూలిక కొమ్మ ఉంది! కోతి చేసిన సహాయానికి మురళి ఆశ్చర్య పోయాడు! ఒక నోరు లేని జంతువు మరొక నోరు లేని జంతువును కాపాడాలనే దాని తాపత్రయానికి మురళి మరింత ఆశ్చర్య పోయాడు!
ఆ విధంగా కోతి రోజూ బోలెడు మూలికల చెట్ల కొమ్మలను మురళికి ఇవ్వసాగింది.దాని సహాయం వలన మరిన్ని మంచి మందులు తయారు చేసి అనేక జంతువులను కాపాడసాగాడు.
ఆ కోతికి ప్రతి రోజూ మంచి పండ్లు,కాయలు ఇచ్చి దాని ఆకలి తీర్చ సాగాడు.
జంతువుల్ని మనం రక్షిస్తే అవి తప్పకుండా మనల్ని రక్షిస్తాయి,సహాయపడుతాయి!
కోతి మెచ్చిన వైద్యుడు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి