అంశం:మొక్కను నాటు...సంరక్షించు:-చంద్రకళ. దీకొండ--స్కూల్ అసిస్టెంట్:మల్కాజిగిరి జిల్లా:మేడ్చల్--చరవాణి:9381361384


 ప్రక్రియ:సున్నితంరూపకర్త:శ్రీమతి నెల్లుట్ల సునీత 
------------------------------------------------------------------
1)
తరతరాలకూ తరగని సంపదలు
ప్రాణవాయువుతో ఆయువునిచ్చు వనదేవతలు
ఆరోగ్యాహ్లాదాలనిచ్చు ఆకుపచ్చని సిరులు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
2)
మానవ జీవశక్తి ప్రదాతలు
జీవులకు ఆశ్రయమిచ్చే పెన్నిధులు
పచ్చనిచెట్లే ప్రగతికి సోపానాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
3)
భూగర్భజలాలను ఒడిసిపట్టి ఉంచాలన్నా
మానవ మనుగడ సాగాలన్నా
తరువులేగా వరాల వనదేవతలు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
4)
చేయకు తరువుకు చేటు
వేయకు గొడ్డలి వేటు
చిన్ని మొక్కను నాటు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
5)
నాటి వదిలివేయకు మొక్కను
దోసెడు నీటితో సంరక్షించు
గంపెడు లాభాలను స్వీకరించు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
************************************
----------------------------------------------------------------------------------
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు 
పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగిస్తుంటాను.ప్రాజెక్టులు వారిచే 
తయారు చేయిస్తుంటాను.వ్యాసరచన,
వ్యక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహించి,
విజేతలకు బహుమతులందించి, వారిని ప్రోత్సహిస్తుంటాను.వారి ప్రతి పుట్టినరోజు
నాడు మొక్క నాటాలని బోధిస్తుంటాను.
ఎన్. జి. సి. లో భాగంగా పాఠశాలలో వారిచే
మొక్కలు నాటించి, నీరు పోయిస్తుంటాను.
కామెంట్‌లు