తొలకరి:--బెజుగాం శ్రీజ-ట్రిపుల్ ఐటీ బాసరగుర్రాలగొంది జిల్లా సిద్ధిపేట-చరవాణి:9391097371

 
*సీసం*
రోహిణికార్తెలో రోళ్ళనుపగిలించె
యెండలుకాయును మెండుగాను
నైరుతిరుతుపవ నాలునురాగను
తొలకరిమొదలాయె పులకరించి
పుడమిపై చినుకులే ముత్యమై మెరవగ
క్రొత్తయాశలుచేరు గొప్పగాను
భూమితల్లినిబాగ ముద్దాడిరైతులు
దుక్కులంతనుదున్ను తొందరగను
నాణ్యమై విత్తుల నమ్మకముగచల్లి
నీరుపెట్టుదినము నేర్పుతోడ
కంటికి రెప్పలా కాపును గాయుచు
పంటదిగుబడికై పాటుబడును
*తేటగీతి*
పంట పండగ రైతుయే పరవశించి
భార్య పిల్లల పోషించు భారమనక
రైతు రాజులా బ్రతుకును రందిలేక
అన్న దాతయై వెలుగొందె యవనియందు

కామెంట్‌లు