తరువులు జీవన ఆదరువులు
పర్యావరణమే మనకు జీవావరణము
ప్రకృతే జీవన వికాసము
చూడచక్కని తెలుగు సున్నితంబు
గాలి,నీరు కాలుష్యం
కాకుండా కాపాడాలి మనం
విరివిగా వృక్షాలను పెంచుదాం
చూడచక్కని తెలుగు సున్నితంబు
అడవులను నరకడం ఆపుదాం
ప్లాస్టిక్ వస్తువులను నిషేదిద్దాం
ప్రకృతి పాడుకాకుండా కాపాడుదాం
చూడచక్కని తెలుగు సున్నితంబు
అవనంతా వనాలను పెంచుదాం
భూరుహాలతో భూమిని నింపేద్దాం
కాలుష్య భూతాన్ని తరుముదాం
చూడచక్కని తెలుగు సున్నితంబు
మనచుట్టు నాటుదాం చెట్లు
అందరికి ఆరోగ్యం పంచుదాం
చేద్దాం జీవితాలను సుఖమయం
చూడచక్కని తెలుగు సున్నితంబు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి