నివాళి:--గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్ 9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
మా సింగిరెడ్డి నారాయణ రెడ్డి
మా తెలంగాణ బంగారు కడ్డీ
పుట్టింది సిరిసిల్ల రాజన్న జిల్లా
అడుగు పెట్టింది గోల్కొండ కిల్లా !

తాను ఉర్దూ మీడియంలో డిగ్రీ చేసే
తెలుగు మీడియం బావుట మోసే
పారశీక భాషను ఎంచుకున్నాడు
తెలుగుపై ప్రేమను పెంచుకున్నడు !

సాహిత్యంలో కవితాస్త్రాల సంధించే
సన్నిహిత్యంలో మమతాస్త్రాల బంధించె
భాషలపై ఆధిపత్యాన్ని తాను సాధించె
భాషలన్నింటిలో కవితలను లిఖించే   !

మంచి బుద్ధి నిచ్చే మహా మంత్రం నీ మాట
ఎంచి గద్దెనెక్కిచే స్వాహా తంత్రం నీపాట
జానపదం నుండి  జ్ఞానపీఠం దాక
ఎదిగావు
నవ్వని పువ్వులలో నవపారిజాతాల పొదిగావు !

అమ్మ ప్రేమ గీతాలను కమ్మగ వల్లించావు
కొమ్మ లేమ గేయాలను కన్ను గీటి మళ్ళించావు
అమ్మైన కొమ్మైన ఆధారం వారన్నావు
సొమ్మైన సోకైన వారే మన గతి అన్నావు!

వీరి పాటలు పున్నమి వెన్నెల కాస్తాయి
కోరి కన్నుల పండుగ అవి చేస్తాయి
అభిమానులకు ఆనందం కలిగిస్తాయి
స్వాభిమానుల తనువు పులకరింప 
జేస్తాయి !

ఎన్నో జాతీయ అంతర్జాతీయ
పురస్కారాలను అందుకున్నాడు
క్యాతి ప్రఖ్యాతి విఖ్యాతి తానొంది
అందరికన్న ముందుతానే ఉన్నాడు

కొండంత అండగా నిలిచావు నీవు
నీ సొంత జనం నియోజకవర్గానికి
ఎన్ని కష్టాలు నష్టాలు సంభవించిన
తిప్పుకున్నాను నీవు నీ మార్గానికి !

జానపద జావళి గీతాలు రాశారు
జ్ఞానపద రవళి చిత్రాలను గీశారు
విశ్వంభర గ్రంథ రచన చేశేశారు
జ్ఞానపీఠ అవార్డును గెలిచేశారు  !

సీనారే సాహిత్య సిరి సంపద
అంతా పంచుకుందాం పద పద
తరగనిది కరగనిది ఈ సంపద
భావితరాలకు ఎంతని పంపెద !

ఆరిపోని సాహిత్య దీపం వెల్గించి
మారిపోని సన్నిహితరూపంమిగిల్చి
మమ్మిడిచి పోయావా ఓ మహాత్మా
మిమ్మువిడిచి ఉండదులే మా ఆత్మ 

మేం అర్పిస్తున్నాం సమర్పిస్తున్నాం
మాతెలంగాణఅక్షర తర్పణతోరణం
నీదీపాంకురంను సదామేంవెల్గిస్తాం
నిత్యారాధన చేస్తూ మే పూజిస్తాం !


కామెంట్‌లు