నల్లమల అడవుల్లో ఒక నక్క ఉండేది. అది తన తెలివితేటలను గూర్చి తోటి జంతువులతో తెగ గొప్పగా చెప్పుకుంటూ ఉండేది. చెప్పిందే చెప్పి వాటికి విసుగు తెప్పించేది. అంతేకాకుండా తోటి జంతువుల రూపురేఖలను గూర్చి తెగ డుతూ వాటిని కించపరిచేది. అనుకోకుండా ఒక నాడు ఆ నక్కకు ఏనుగు, పులి, ఒంటె, కుందేలు ఎదురు పడ్డాయి. మీరంతా నా సలహా కై వస్తున్నట్లు ఉన్నది. ఇప్పటికైనా నా నన్ను నా తెలివితేటలు లను గూర్చి తెలుసుకుని నా వద్దకు మీరు వచ్చినందుకు నా ధన్యవాదాలు. అంటూ తనతో కోరుకుంటూ వాటి ముందుకొచ్చి ఠీవిగా కూర్చొని "నీకు భగవంతుడు కొండలాంటి భారీ శరీరం ఇచ్చాడు. తాటాకు లాంటి చెవులిచ్చాడు. గుడ్లగూబ లాంటి కండ్లు ఇచ్చాడు. వంకరటింకర స్తంభాలాంటి కాళ్ళు ఇచ్చాడు. మెత్తని పైపు లా ఉండే తొండాన్ని ఇచ్చాడు. ఇన్ని చి చివరకు ఆ దేవుడు నీ బుర్రలో బుద్ధిని పెట్టడం మర్చిపోయాడు"అంటూ ఏనుగును వెక్కిరించింది. తన తోటి జంతువుల మందు నక్క అలా మాట్లాడినందుకు ఏనుగు తెగ బాధ పడింది.
ఓ పులి బావ ఇప్పుడు నీ గురించి చెప్తా" గతంలో నీవు బ్రాహ్మణుడికి బంగారు కడియం ఇచ్చి ఎలా బంగపడ్డావో నీకు గుర్తుండే ఉంటుంది. ఆ...అంటే ఊ....అంటే గాండ్రించడం తప్ప నీకేమీ తెలియదు. దానికి కారణం నీకు కూడా ఆ దేవుడు తెలివి ఇవ్వకపోవడమే. అని అనగానే పాపం పూలి రాజు పిల్లి రాజుయై గుడ్లు తేలేసింది. ఒంటే మరియు కుందేలు ఏనుగును, పులిని వెక్కిరించిన విధానం గమనించి, తమను కూడా ఈ నక్క వదిలేటట్టు లేదు బాబోయ్ అని మనసులో అనుకొని"ఇక్కడి నుంచి వెళ్లి పోదాం పద అంది ఒంటె తో కుందేలు.
ఆగండి ఆగండి మిత్రులారా ! మీ జాతకం కూడా చెప్తా అంటూ కుందేలు మామా గతంలో నీవు కూడా బుద్ధిలేని తనంతో తాబేలుతో పరుగు పందెం లో పోటీపడి ఓడిపోయిన వైనం నీవు ఓసారి గుర్తు తెచ్చుకో ఆ పందెంలో నీవు ఓడిపోవడానికి కారణం నీ బుర్రలో తెలివి లేకపోవడమే అర్థం అయిందా తెలివితేటలు లేని నీ బ్రతుకు వ్యర్థం అని అనగానే పాపం కుందేలు ఢీలా పడిపోయింద
ఇక నీ కథ చెప్తా వంకరటింకర కాళ్లు ఉన్న ఓ ఒంటె బావ"మీరోసారి సహారా ఎడారిలో ఎండమావుల ను చూసి నీళ్లను కొని త్రాగబోయి నేలపై బొక్క బోర్లా పడ్డారు. ఇది గుర్తొచ్చినప్పుడల్లా నాకు భలే నవ్వొస్తుంది. నీవీ పరాభవానికి కారణం నీ బుర్రలో బుద్ధిలేని తనమే. అంది నక్క.
ఆ నక్క మాటలు విన్న ఏనుగు" ఓం నక్క బావ! మీరీ వేళ
మా అందరి జాతకాలు చెప్పి మమ్ముల అప్రమత్తత చేసినందుకు మా అందరి తరపున నీకు మా ప్రత్యేక ధన్యవాదములు. మీ రుణం తీర్చుకునేటందుకు రేపు మీకు మా ఇంట విందు ఏర్పాటు చేస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి "అంది ఏనుగు.
మీరు విందు ఇవ్వడం నేను రాకపోవడం మా తప్పకుండా వస్తాను నంది నక్క. వెంటనే అక్కడి నుండి పులి, ఏనుగు, ఒంటె, కుందేలు తమ నివాసాలకు వెళ్ళిపోయాయి.మరునాడు ఆ నక్క ఆగ మేఘాల పైన ఏనుగు ఇంటికి చేరుకుంది. విందు ఏర్పాట్లను పరిశీలించింది. ఇది గమనించిన ఏనుగు "నక్క బావ గారు కాళ్లు కడ్కొండి అంటూ తన తొండం తోని నీళ్ల చెంబును నక్కకు అందించింది. నక్క ఆనందంగా నీళ్లను నోట్లో పోసుకుని పుక్కిలించి పూసింది. ముఖం కాళ్లు చేతులు కడుక్కుని వచ్చి విస్తరి ముందు కూర్చుంది. విస్తరిలో పాయసం గమగమ లాడి పోతుంది. నోటితో పాయసాన్ని జుర్రుకుంది. మింగబోగా, దవడలు అతుక్కొని పోయాయి. నాలుక కదలకుండా అయింది. అంతేకాకుండా ముఖము కాళ్లు చేతుల్లో దురద మొదలైంది.
పాపం నక్క దవడలు కదలక అత్తుక పోయినందువల్ల పాయసం తాగలేక పోయింది. దురద భరించలేక గోక్కోవడంతో రక్తం కారి తెగ బాధ పడుతూ అవమానంతో అక్కడి నుండి పలాయనం చిత్తగించింది. పరుగో పరుగు అంటూ పారిపోయిన ఆ నక్క ఇక ఎప్పుడు మన జోలికి రాదు లే అంది ఏనుగు నవ్వుతూ.
అప్పుడు పులి,ఒంటె, కుందేలు ఒక్కసారిగా" ఏనుగు మామా ! నీవు ఏం మాయ చేసావు? ఆ నక్క తిక్క ఎలా కుదిర్చావు" అని అడగగా, అసలు విషయం చెబుతా వినండి "అది అది కడుక్కునే నీళ్లలో తీట కోయిల్ ఆకు రసం కలిపాను. తినే పాయసంలో చూయింగ్ గమ్ కలిపాను. అని ఏనుగు చెప్పగా అసలు విషయం అవగతమై అన్నీ హాయిగా నవ్వుకున్నాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి