శాంతిదూత బాపూజీ
బుల్లి బుల్లి పిల్లలం మేం
శాంతి దాత మా శాస్త్రిజీ
అల్లీ బిల్లీ మంచి మల్లెలు !
మేము నవతరం యోగబలం
జవానులైన వారలం వీరులం
మా యువతరం నిరంతరం
సవారిచేయు రథసారధులం !
కృష్ణ కృష్ణ రామ కృష్ణ మా దేవుడు
రామరామ మేం మరువని ఘనుడు
ఆపరమహంసేమాకండగ ఉన్నాడు
జీవ హింస చేయకుండి అని అన్నాడు
మా దేశభక్తిని ఇష్టంగా పెంచుకొని
ఆ దైవశక్తిని కష్టంగా ఎంచుకొని
స్వార్థ చింత సంద్రాన్ని దాటుతాం
నిస్వార్థ పంథ కేంద్రాన్నిచాటుతాం
పొలంలో విత్తనాలు విత్తుతూ
గళంతో పుస్తకాలు చదువుతూ
పెత్తనాలు మేం చేస్తూనే ఉంటాం
వాస్తవాలు సదా వెతుకుతుంటాం
మా ఎత్తిపోతల జలాల తొండిని
మేం ఖరాఖండిగ ఖండిస్తున్నాం
ఉత్తమోత్తమమావ్యవసాయంతో
మేం గుత్తంగా పుత్తడినే పండిస్తాం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి