మహోన్నత శిఖరం నాన్న..!:-పిల్లి.హజరత్తయ్య-శింగరాయకొండప్రకాశం జిల్లా-9848606573
కష్టాల కడలి తరుముతున్నా
నమ్ముకున్న నావ ముంచినా
బిడ్డల చిరునవ్వుల జ్ఞాపకాలే
ఊపిరిగా బతికే ప్రేమమూర్తి ..!

ఆకలి దేహాన్ని దహిస్తున్నా
అవయవాల పనితీరు నశిస్తున్నా
చావు కంటిముందు కదలాడుతున్నా
కరుగుతూ వెలుగునిచ్చే త్యాగమూర్తి ..!

కుటుంబంలో ఆటుపోట్లు ఎదురైనా 
జీవితంలో ఓటమి వెక్కిరించినా
బిడ్డల రేపటి భవిష్యత్తుకై
బాధను పెదవి దాటనివ్వని సహనమూర్తి..!

ఓర్పు,సహ

నానికి మారుపేరై
ఆశలు,ఆకాంక్షలు తీర్చే దైవమై
నిను వేలుపట్టి నడిపించే
మహోన్నత శిఖరము నాన్న..!

వేదన స్మృతులు కుంగదీసినా
అజ్ఞానాంధకారం ఆవహించినా
నేనున్నాను కన్నా అంటూ
విజ్ఞానదీపాన్ని వెలిగించే వేగుచుక్క నాన్న..!

కామెంట్‌లు