:పిల్లలం పసి పిల్లలం:-కావ్య లహరి :--పిల్లి.హజరత్తయ్యశింగరాయకొండ 9848606573
పిల్లలం పసి పిల్లలం
ముసి ముసి నవ్వుల గువ్వలం
భరతమాత ముద్దు బిడ్డలం
భావి భారత పౌరులం  1పిల్లలం1

చక్కగా బడికి వెళ్తాము
చక్కని పాఠాలు వింటాము
మంచిమాటలు నేర్చుదము
మనిషిగా మేము ఎదుగుదుము  1పిల్లలం1

బుడిబుడి నడకలతో మేము

బుద్ధిగ బడిలో మెలుగుదుము
బాధ్యత నెరిగి నడువుదుము
బడి గౌరవాన్ని కాపాడుదుము  1పిల్లలం1

విషయాలను నేర్చుకుంటాము
విలువలను మేము గ్రహిస్తాము
విజ్ఞానమును సంపాదించుదుము
వినయ విధేయతలను పొందుదుము  1పిల్లలం1

బడిని గుడిగా తలచెదము
గురువులను గౌరవించెదము
సరస్వతీ కటాక్షం పొందెదుము
జీవితంలో చక్కగా ఎదుగుదము  1పిల్లలం1
కామెంట్‌లు