1️⃣
గురుడు మకరరాశిలో ప్రవేశించు
తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించు
ఆంధ్రప్రదేశ్ వైభవంగా నిర్వహించు
చూడచక్కని తెలుగు సున్నితంబు.
2
తుంగభద్ర పంచగంగలో ఒకటి
తుంగభద్ర పుష్కర ఘాట్ లలో
అలంపూర్, మంత్రాలయం ప్రముఖమైనవి
చూడచక్కని తెలుగు సున్నితంబు.
3️⃣
పుష్కర స్నానం పుణ్యప్రదము
స్నానాలు ఆచరించిన శుభము
పోగొట్టు మానవుని పాపము
చూడచక్కని తెలుగు సున్నితంబు.
4
పితృదేవతలకు తర్పణాలు గావించు
పూజలు,దానాలు ఆచరించు
పన్నెండు రోజులు స్నానమాచరించు
చూడచక్కని తెలుగు సున్నితంబు.
5️⃣
జీవరాసులకు ప్రధానమైనది జలము
నదీ స్నానము ఆరోగ్యాన్నిచ్చు
నదీస్నానాన్ని గుర్తుచేసేవే పుష్కరాలు
చూడ చక్కని తెలుగు సున్నితంబు
తుంగభద్ర పుష్కరాలు;--పిల్లి.హజరత్తయ్య- సింగరాయకొండ, ప్రకాశం జిల్లా-చరవాణి :9848606573
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి