పరిమళ ఏదైనా తినడానికి తీసుకువస్తే విక్కీ తినకుండా మారాం చేస్తూ వాళ్ళ అమ్మకు దొరకకుండా కుర్చీలు ,సోఫాల సందుల్లో దూరి పరుగులు పెట్టిస్తుంటాడు . ఎక్కడ పడుతాడో ,దెబ్బలు తగులుతాయో అని ఆందోళన వున్నా విసుగు చెందక ఫ్రేమగా ముద్దుమద్దు మాటలు . కథలు చెప్పి తినిపిస్తుండేది కొన్నిసార్లు ట్యాబ్ ,ఫోనులు చూపిస్తూ తినిపించేది .
రోజులాగే విక్కీకి తిండి తినిపిస్తోంది . పరిగెత్తుతూనే వున్నాడు విక్కీ . అప్పుడే ఊరునుండి పరిమళ వాళ్ళ అన్న వేణు వదిన మాధురి పిల్లవాడు శశాంక్ ఇంటికి వచ్చారు . శశాంక్ విక్కీ కంటే కొంచం పెద్ద వాడు. వాళ్ళని చూడగానే .ఏం అన్నయ్య , వదినా .... బాగున్నారా ?” అంది . “ ఊ( .. బాగున్నామ్ వదినా.. ఏంటి .. నీ కొడుకు నిన్ను పరుగులు తీయిస్తున్నాడు . “ అంది నవ్వుతూ . “ ఏం చేసేది వదినా .. వీడు తిండి దగ్గర రోజు ఇలాగే చేస్తాడు ... సరే ఇవన్నీ రోజు వుండేవే ముందు ప్రయాణం, చేసి వచ్చారు . ఫ్రష్ అయ్యి రండి భోజనాలు చేస్తాం “ అంది . ఫ్రష్ అయ్యి వచ్చారు . ముందు శశాంక్ కి పెట్టు వాడు ఆకలితో వుంటాడు . మనం తరువాత తింటాము . “ అంది పరిమళ . మాధురి అన్నం కలిపి వాడికి ప్లేటు చేతికిచ్చింది వాడు మారం చేయక తినడం పరిమళ చూసి “ మీ వాడు మారాం చేయక తినేశాడే “ . పోయిన సంవత్సర వరకు మీ వాడిలానే నన్ను పరిగెత్తించేవాడు . వాడికి ఇష్టమైన ఏదో రెండు , మూడు టిఫిన్లు కొద్దిగా తినేవాడు , టిఫిన్లలో వేసే పప్పులు . గింజలు తినకుండా పక్కన పెట్టేవాడు . అన్నం గూడా అంతంత మాత్రమే తినేవాడు . మేము అప్పుడు టీవిల్లో చూపే పాల పొడులు, ఎనర్జీ డ్రింక్స్ పెట్టాలి అనుకున్నాం .. కానీ బాగా ఆలోచించి నేను జీడి పప్పులు ,బాదం పప్పులు లాంటి పప్పులన్ని మిక్సీ కేసి పొడి చేసి వాడు ఏవి ఇస్తాం ఇష్టంగా తింటాడో వాటిలో కలిపి వండి తినిపించడంతో రుచి మరిగి ఇష్టంగా అన్నీ తినడం మొదలు పెట్టాడు . అప్పటి నుoడి మాకు వీడి బెంగ తీరిపోయి హాయిగావుంది . “ అవునే ఇదేదో బాగుంది నేను రేపటి నుoడి నీలానే చేసి చూస్తాను . “ అంది “: ఇందాక మీ వంటింటి షల్ఫ్ లో చూశాను . మూడు ,నాలుగు రకాల పాల పొడులు పెట్టు కున్నావు . అవి పెట్టడం మానేసి వాటి బదులు డ్రై ఫ్రూట్స్ తెచ్చి నేను చేసినట్లు చేసి పెట్టు, పశువుల నుండి తాజాగా ప్రీతికిన స్వచ్చమైన పాలు తెప్పించి ఇవ్వు రుచికి రుచి బలం అన్నీ వస్తాయి ఎప్పుడు హుషారుగా ,చెలాకి గా వుంటారు బ్రైన్ చురుగ్గా పని చేస్తుంది . “ అంది “ అలాగే వదినా “ మంచి సలహా ఇచ్చావు . అంటూ అందరూ భోజనానికి కదిలారు .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి