*సీసము*
*భగభగమండేటి భానుని యెండలో*
*మ్రగ్గిమాడుచు గూడ మౌనముగను*
*ముళ్ళను గంపలన్ మొదలుగ నరుకుచు*
*బీడు బారిన నేల బెడగు జేసి*
*స్వేదంబుచిందించుస్వీయంపు రక్తమున్*
*బండరాళ్ళను గూడ బాగు జేయు*
*సేద్యంబునొనరించి చిందించు సత్తువన్*
*కర్షకుండు గాదె కమల నయన*
*(బెడగు...అధికము,మనోజ్ఞము)*
*ఆట వెలది*
*విత్తనాలుదెచ్చి విత్తును మొదటగ*
*మొలచిన మొలకలను మురిపెముగను*
*కంటిరెప్పలోలె కావుచు బెంచును*
*పండి నట్టి పంట ప్రజకు బెట్టు*
*ఆట వెలది*
*భాష యాస గున్న భావమెంతో మిన్న*
*మాట కటువుగున్న మనసు వెన్న*
*ఆత్మబంధువులుగ యాదరించు గుణము*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి