మన దేశంలో ఓ అబ్బాయి వుండేవాడు. ఆ అబ్బాయిని ఈ సమాజం అంటరానివాడివంటూ వెలివేసింది. ఆ అబ్బాయి చాలా పేదవాడు. కానీ చాలా తెలివిగలవాడు. బాగా చదుకోవాలనే సంకల్పం ఉండేది. సంకల్పానికి దాతలు వూతం ఇచ్చారు. విదేశాలకు వెళ్లి గొప్ప చదువులు చదివాడు. ఆయన చదివినంత చదువు ఇప్పటి వరకు ఎవరు చదవలేదు. అతి పెద్ద ప్రజాస్వామ్య మైన మన భారతదేశానికి రాజ్యాంగం రాసాడు. అయినా ఈ దేశం ఆయనను మరిచిపోయింది. కానీ ఐక్యరాజ్యసమితి మాత్రం ఆయనను అత్యుత్తమ వ్యక్తిగా గౌరవించింది. ఆయన 125వ జయంతిని ఘనంగా నిర్వహించింది. కొలంబియా విశ్వవిద్యాలయం ఆయనను అత్యుత్తమ పూర్వ విద్యార్థిగా గౌరవించి ఆయన విగ్రహాన్ని విశ్వవిద్యాలయ ఆవరణలో నెలకొల్పింది. రష్యా ప్రధాని తన కార్యాలయంలో ఆయన నిలువెత్తు చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనే మహా మేధావి భారతరత్న డా. బి.ఆర్. అంబేత్కర్. బడుగు బలహీన వర్గాలకు దేవుడు ఆయన. భారత మాత కన్న ముద్దు బిడ్డ. మట్టిలో పుట్టిన మాణిక్యం.
మట్టిలో పుట్టిన మాణిక్యం.( బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి