మొక్క కు రక్షణలేదు
మనిషికి బుద్దిలేదు ...
సహజవనరులు -
విస్మరించి ......
కృత్రిమ వనరులకు
ఆర్రులుచాచి
అదే ఆధునికత అంటాడు !
మహిళకూ రక్షణలేదు
మనిషి చూపుకూ అర్ధంలేదు ,
ఇంటిలో ...
అమ్మ -ఆలీ -చెల్లీ ఉన్నా
బయటి ...
స్త్రీమూర్తిని చూస్తే ,
కామం జడలువిప్పి ....
కళ్ళుమూసుకుపోతాయ్ !
మంచి -చెడూ ...
మనిషినుండే -
పుట్టుకొస్తాయ్ ....
ప్రకృతి పులకిం చాలన్నా
పడతి ఉనికి కి --
భద్రత కావాలన్నా ,
స్వార్దానికి సంకెళ్లు పడాలి !
మనిషిఆలోచనలో ....
మార్పుకు బీజంపడాలి ...!!
ప్రకృతి --పడతి ..!!:-డా.కె.ఎల్.వి.ప్రసాద్,హన్మకొండ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి