చిన్నప్పుడు
నాన్నగారి లాల్చీ వేసుకుని
ఆనందించడం
లేక అన్నయ్యల చొక్కాలు లేసుకోవడం
నాన్నవో లేక
అన్నయ్యల చెప్పులు వేసుకుని
అటూ ఇటూ నడిచి ముచ్చటపడటం
నాన్న చదివి పక్కన పెట్టిన
ఏదో ఒక పుస్తకాన్ని
నాన్నలా కూర్చుని తిరగేయడం
ఇలా చిన్నప్పుడు
అన్నీ పెద్ద పెద్ద ఆశలు ఉండటం
నాకే కాదు
మీకూ ఉండి ఉంటుంది
కానీ
ఎందుకో తెలీదు
పెరిగి పెద్దయ్యాక
ఆశలు ముడుచుకుపోతాయి
ఆలోచనలూ సన్నగిల్లుతాయి
కానీ
ఇదంత మంచిది కాదేమో
అని నా అభిప్రాయం....
ఆశలు
ఆలోచనలూ
సవ్యమై ఉంటే
అది ఏ వయస్సులోనైనా
పురోగతికి దోహదపడతాయి
తోటివారికీ పనికొస్తాయి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి