13)
మానవసేవే మాధవసేవ
కనుక నీవు చేసిన ఈపనికి
నిన్ను నేను అభినందిస్తున్న
నూరేళ్ళు చల్లగా ఉండమ్మా!
14)
మానవత్వం పరిమళించిన
ఈ పాప తెలుసా మీకు?
"ఆగ్నస్ బోజాక్సియొ" అనియెడు
పేరామెది పసితనమున!
15)
చిన్ననాడె దీనులయెడ
కరుణను కురిపించి ఆమె
అందరికి అమ్మ అయినది
"మదరు థెరిస" పేరయినది!
16)
అట్టి దేవత పాదాలచెంతకే
పద్మశ్రీ,భారత్ కీ సుపుత్రిక,
భారతరత్న,నోబులు పురస్కారా
లామెను వరించి వచ్చినవే కదా!!
(సమాప్తం)
కరుణామయి*(గేయకథ)(నాలుగవ భాగము):- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి