పది అంకెల గేయం:---గద్వాల సోమన్న

ఒకటి ఒకటి ఒకటి
నోరు నాకు ఒకటి
రెండు రెండు రెండు
కళ్ళు నాకు రెండు

మూడు మూడు మూడు
ముక్కు,చెవులు మూడు
నాలుగు నాలుగు నాలుగు
కాళ్ళు,చేతులు నాలుగు

ఐదు ఐదు ఐదు
చేతికి వ్రేళ్ళు  ఐదు
ఆరు ఆరు ఆరు
అందరి మంచి కోరు

ఏడు ఏడు ఏడు
నిర్లక్ష్యాన్ని  వీడు
ఎనిమిది ఎనిమిది ఎనిమిది
మేలు దేవుని సన్నిధి

తొమ్మిది తిమ్మిది తొమ్మిది
తెలుగు తరగని ధననిధి
పది పది పది  తెలుగు
భాషలందున వెలుగు

కామెంట్‌లు