5)
నేను పగలు భూమిపైఉంటా
నిశిన చందమామలో నేనుంటా
నీవేడ నేనేడ నీకునాకేడ
వేగపోవాలి తొలగు శనిగాడ!
6)
కుందేలు చెప్పిన మాటలువిన్నది
తాబేలు ఇలా అన్నది
వాస్తవమే నీవు చెప్పినావు
నామాట కూడా వినగలవు!
7)
ఎగురుబాటు ఎన్నడూ నేనెరుగనండి
ఎగిరిపడితె ఎప్పుడూ తిరుగబడుబండి
గొప్పలడప్పు కొట్టుకొనుట ఇట్లు
మెరిసేది ప్రతిది పైడిఎట్లు!
8)
తనకున్నదే గొప్ప అనుకుంటారు
ఎదుటివారి గొప్ప పట్టించుకోరు
గర్వించి ఎగురువారు మనలోనకలరు
గర్వముడిగిన నిజము కనగలరు!
(ఇంకావుంది)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి