వారాలు (బాలగేయం):-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.

 సోపతి పెంచును  సోమవారం
మార్పలు తెచ్చును మంగళవారం
బుద్దులు నేర్పును బుధవారం 
గురువును చేర్చును గురువారం
శ్రోతగా నిలుపును శుక్రవారం
శ్రద్దలు పెంచును శనివారం 
అందర్నీ కలుపును ఆదివారం
వృధా చేయవద్దు సమయం
మంచి ప్రణాళిక ఉండాలి 
నిత్యం తప్పక పాటించాలి
సాధన యందున మునగాలి 
గెలుపు లతోనే మెరువాలి.
కామెంట్‌లు