ఆమె చల్లని పాదాల కింద ఒక సముద్ర వారధి ఆవిర్భవించింది!?
కోట్ల నక్షత్రాల్లా ఆకాశమార్గంలో పుడుతున్న
పచ్చని అభయహస్తాలు అరణ్యాలు ఆమె శిరోజాలు!?
గల గల పారే భూగర్భ జలాలు ఆమె నగుమోముపై పారే నదులు!?
ఘనీభవించిన మంచు శిఖరాలు ఆమె మనసుటద్దాలు
సంతోష దుఃఖాలు ఆమె దిగంబర అభిషేకపు జలపాతాలు !?
తూర్పు పడమరల్నీ మాత్రమే దిక్కుల్నీ చేసి జనన మరణాల పురాణాల్ని రచించిన నయనాలు అవి!?
ఏడురంగుల తిలకం ఎగిరేసిన భూలోకపు మర్మం ఆమె!?
నలుపు తెలుపు చేతులతో నిర్మించిన రంగుల మాయల ఉయ్యాలలో దేవునికి కూడా తెలియని రహస్య పసిపాపలు వాళ్లు
రక్త సముద్రాలు వాళ్ళు!?
లోకాల్ని కనీ శోకాల్నీ దిగమింగి త్రిశంకు స్వర్గంలో ఉన్న శిలల్నీ శిల్పాలుగా చెక్కిన జక్కన్న వారసులు వాళ్ళు!?
సమస్త ప్రకృతి సంకల్పబలంతో పూలు ఫలాలు ఆకులతో తమను తామే సమర్పించుకుని ప్రతి పురుషుని పూజించి దేవున్నీసృష్టించిన దేవతలు వాళ్లు!?
సూర్య చంద్రుల కలల్ని నిజం చేసి ఒక మగాన్ని జగానికీఇచ్చిన ధీర వనితలు!?
గుండెల్లో మహా పర్వతాలని కరిగించి ఆకుపచ్చని రక్తదానం చేసిన ఆమె నులి వెచ్చని కౌగిలి ఈ లోకం!?
నాలుగు కాళ్ళ నుంచి రెండు చేతులను తయారుచేసిన తొలి మహిళ ఆమె!?
కడలిని కనడ మే కాదు పెద్దలకు చిన్న లకు సహాయపడే అందమైన చిన్న పెద్ద మెదడు ఆమె!?
Pratapkoutilya
Lecturer in Bio-Chem
8309529273
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి