ముద్దుల పాపాయి:--గద్వాల సోమన్న

 ఒడిలోని పాపాయి
బడిలోన చేరింది
గుడిలోని దీపమై
మదిలోన వెలిగింది
మడిలోని మొలకలా
మహిలోన  ఎదిగింది
అక్షరం నేర్చింది
నక్షత్రమయింది
మింటిలో చుక్కలా
ఇంటిలో వెలసింది
కంటిలో పాపలా
చంటి పాపయింది
అజ్ఞాన తిమిరాన్ని
విజ్ఞాన జ్యోతియై
ప్రజ్ఞతో తరిమింది
పాపాయి మెరిసింది

కామెంట్‌లు