1.ఏంధ్రపాలజీ అర్ధమైంది!
సైకాలజీ అయోమయం!
వికాసాన మనిషి పయనం!
అనంతమా!అంతమా!
2.కులాలవృత్తాలు నిత్యం,
ఆవృతం!
మతాలమౌఢ్యాలు వదలని,
జాడ్యం!
వాదాలు,వివాదాలు ఆరని,
అగ్నిహోత్రం!
మానవజీవితం అర్థం కాని,
ప్రశ్నాపత్రం!
3.దైవం నామరూపాల్లో భేదం!
అనుక్షణం ఆగని ఖేదం!
మనిషి మానవాతీతుడవ్వాలా!
మానవమాత్రుడైతే చాలదా!
4.మనిషి,
వైవిధ్యాలు సమాకలనం,
చేయాలి!
వాదాలు మాని సంవాదాలు,
వినాలి!మానవత్వమహానాదం,
విశ్వాన వినిపించాలి!
పర్యాటకరంగం తప్పక,
విస్తరించాలి!
జీవిత పరమార్ధం తెలియాలి!
5.సత్యాన్వేషణ జీవనపథం!
తత్త్వశోధన నిజతత్త్వం!
ఏ మనిషికైనా ఒక్కటే పేరు,
*హోమోసెపియన్*
దేవుడుకి పేరే లేదు!
మనిషి *ఒక్కడే!*
ఆ *ఒక్కడిని* గుర్తిస్తే,
మానవుడే *మాధవుడు!*
దైవం ఎక్కడున్నాడో,
వెతకడం వృధా!
మనిషి హృదయంలో
ఉన్నాడన్నది నిజం కదా!
మరి, ప్రదక్షిణాలేల!
ఆత్మప్రదక్షిణమే!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి