కథ, గేయం, నవల, నాటిక …. ఏదైనా సరే …. పిల్లల కోసం వ్రాసినదైతే చాలు… అందరికీ అందుబాటులో ఉండాలన్న సదుద్దేశంతో, ఆసక్తి గల బాలబాలికలు చదవుకునేందుకు ఉపయోగపడడమే కాకుండా పరిశోధనా స్కాలర్లు సైతం ఇక్కడి నుండి వారు కోరుకున్న బాల సాహిత్య ప్రచురణలు పొందవచ్చునన్న ధ్యేయంతో ప్రారంభించబోతున్న సంస్థ “బాల సాహిత్య నిలయం”.
1980 నుండి “సాహితీ లహరి“ పేరుతో సాహిత్య సేవ చేయడమే కాకుండా గత పదేళ్ళుగా “ మంచిపల్లి సత్యవతి జాతీయ బాలసాహిత్య పురస్కారాన్ని” ప్రదానం చేస్తున్న డాక్టర్ మంచిపల్లి శ్రీరాములు గారి మానసిక పుత్రిక ఈ బాల సాహిత్య నిలయం.
ఇందుకు రచయితలు , రచయిత్రులు చేయాల్సిందల్లా తమ రచనలను ఒక్కో కాపీ క్రింది చిరునామాకు పంపించడమే.
బాల సాహిత్య రచయితలు తమ రచనలను పంపించడమే కాకుండా ఈ సందేశాన్ని సహ రచయితలకు పంపించి వారి గ్రంథాలను మాకు పంపేలా సహకరించమని మనవి
ఇక్కడకు చేరుకున్న ప్రతి పుస్తకం రిజిస్టర్ లో నమోదు చేయబడి వరుస క్రమంలో భద్రపరచబడుతుంది.
రచయిత(త్రు)ల సహకారంతో గొప్ప బాల సాహిత్య భాండాగారాన్ని తయారు చేద్దాం. ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత మాది, మీది, మనందరిది.
చేయి చేయి కలుపుదాం బాల సాహిత్య నిలయాన్ని పుస్తకాలతో సమృద్ధిగా నిలిచేలా చేద్దాం.
చిరునామా:
డాక్టర్ మంచిపల్లి శ్రీరాములు, సాహితీ లహరి, శ్రీ సత్యా హిందీ భవన్ , పార్వతీపురం, విజయనగరం జిల్లా 535501
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి