1.నదిని చూడు!
అడ్డంకుల్ని తోసేస్తోంది!
కాకుంటే తప్పుకు పోతోంది!
పుట్టినప్పటినుంచి ముందుకే!
2.మట్టి మెత్తదనం!
విత్తేదయినా మొలకవుతుంది!
కాకుంటే కలిసిపోతుంది!
తాను నీ "అడుగు",
అడుగునే ఉన్నా!
ఊతనిచ్చి,
ముందుకే అడుగేయిస్తుంది!
3.అగ్ని ఊర్ధ్వముఖమే!
దహించడం, విస్తరించడం!
జ్వాలై విక్రమించడం!
మొదలైందా! ముందుకే!
4.వాయువు ఆయువే!
ఊపిరిగా నిలిచి,
ప్రాణాలు నిలిపి,
నడుపుతోంది ముందుకే!
5.మనిషి!
నదిలా ప్రవహిస్తాడు!
మట్టిలా మొలకెత్తిస్తాడు!
అగ్నిలా జ్వలిస్తాడు!
వాయువులా ఊపిరినిస్తాడు!
ఆకాశానికి హద్దవుతాడు!
6.బతకడం కదలడం!
ముందుకు దూసుకు పోవడం!
లక్ష్యం శీఘ్రంగా చేరడం!
తనని తాను నిరూపించడం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి