అమ్మ (బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట

అమ్మ మనసు
వెన్న కన్న మిన్నరా
అమ్మ ప్రేమ
తేన కన్న తీపి రా

అమ్మ కను చూపు
వెలిగే జ్యోతలు రా
అమ్మ పిలుపు
ఎంతో మధురంరా
 
అమ్మ చూపు దారి
పూల దారిరా
అమ్మ చెప్పే మాట
ముత్యాల మూటరా

అమ్మ ఇచ్చే దీవెన
విజయానికి నాందిరా
అమ్మను నీవెప్పుడు
మరిచి  ఉండకు రా

కామెంట్‌లు