విద్యార్ధులకు ఉచిత వీడియో క్లాసులకోసం యాప్ ఆవిష్కరణ..: వెంకట్ , మొలక ప్రతినిధి

  *మొలక ఎడ్యుకేషన్ డెస్క్:* యుకెజి నుండి ఇంటర్మీడియట్, జేఈఈ, నీట్ విద్యార్ధులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించటానికి 'కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్, హైదరాబాద్' ఆధ్వర్యంలో రూపొందించబడిన "eCalcus Free Online Classes" యాప్ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ యాప్ లో మాథ్స్ మరియు సైన్స్ సబ్జెక్టులకు సంబదించిన ప్రాక్టీస్ మెటీరియల్ మరియు విద్యార్ధులకు సులభంగా అర్ధమయ్యే విధంగా హిందీ, ఆంగ్ల భాషలలో బోధించబడిన యానిమేటెడ్ వీడియోలను తరగతి వారీగా పొందుపరిచారన్నారు. ప్రస్తుతానికి 1050కి పైగా వీడియోలు మరియు 19600 కు పైగా ప్రశ్నలను పొందుపరిచారు.

విద్యార్ధులు గూగుల్ ప్లే స్టోర్ నుండి "eCalcus Free Online Classes" యాప్ ను డౌన్లోడ్ చేసుకొని వారి పేరును రిజిస్టర్ చేసుకోవటం ద్వారా  సంబందిత పాఠ్యాంశాలను ఉచితంగా వీక్షించవచ్చును. దీనికి విద్యార్ధులు ఏ విదమైన రుసుమును చెల్లించనవసరంలేదు. ఇప్పుడున్న పరిస్థితులలో విద్యార్ధులకోసం ఇలాంటి ఉచిత సేవలనందిస్తున్న సంస్థ ఫౌండర్ వాణీకుమరిని ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

కామెంట్‌లు