తెల్ల రంగు చిలుక (బాల గేయం):-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
తెల్ల రంగు రామచిలక
చిన్నగ మెల్లగ వచ్చింది
మోడు మీద వాలింది
చిన్నబోయి చూస్తుంది

నల్ల రంగు కళ్ళు
బూడిదరంగు కాళ్లు
అందమైన ముక్కు
వెండి వెన్నెల చిలుక

అటు ఇటు చూస్తుంది
చిన్నబోయి కూర్చుంది
అడవి వదిలి వచ్చింది
అందాల ఆ చిలుక

దారి తప్పిన ఆ చిలుక
ఎంత దూరం వచ్చింది
ఏమి తెలియనిదా  చిలుక
గమ్యం కొరకు చూస్తుంది



కామెంట్‌లు