కొన్ని ఆకుకూరలు:---గద్వాల సోమన్న
పాలకూర,సొయ్యకూర,
గోంగూర, తోటకూర,
మునగాకు,బచ్చలికూర
తినిన మేలు బాలలూ!

క్యాబేజీ,చుక్కకూర,
కాలిఫ్లవర్,కొత్తిమీర,
పుదీన,గంగవల్లి కూర,
తినిన మేలు బాలలూ!

ఖనిజ లవణాలెన్నో
కాల్షియం, విటమిలెన్నో
వీటితో లాభలెన్నో
తినిన మేలు బాలలూ!

మంచివి ఆకుకూరలు
ఉన్నవి పోషక విలువలు
ఇవి ఆరోగ్య ప్రదాతలు
తినిన మేలు బాలలూ!


కామెంట్‌లు