అదుపు....అచ్యుతుని రాజ్యశ్రీ

 అదుపు అంటే మనని మనం నిగ్రహించుకోటం.నోటితో అవాకులు చెవాకులు పేలకుండా ఉండటం. అవతలివారు అనవసరంగా  అంటే  మర్యాదగా జవాబు ఇవ్వడం లేదా నిశబ్దంగా ఉంటే ఉత్తమం.మన ఋషులు తమశరీరం మనసుని అదుపు లో ఉంచుకుని ఒంటరి గా సాధన చేశారు కాబట్టే ఇప్పటికీ వారు చిరంజీవులు. వాల్మీకి  వేటగాడి బాణంకి కుప్పకూలిపోయిన పక్షిని చూసి శోకిస్తే అది శ్లోకం గామారి రామాయణం  నిత్య పారాయణం అయింది. శిశుపాలుడు నూరు సార్లు తిట్టేదాకా ఊర్కుని ఆపై భరతం పట్టాడు కృష్ణుడు. మరి మన నోటిలోని నాలుక 32దంతాల మధ్య నలిగిపోకుండా ఎంత జాగ్రత్తగా ఉంటుంది?!ఇదే అదుపు. 
  .     ఆరోజు టీచర్ క్లాసులోకి వచ్చేప్పటికి పిల్లలు అంతా గోల గోలగా అరుస్తున్నారు.అటెండెన్సు తీసుకోకుండా  నించో పెట్టి చెవులు పట్టుకుని  మూడు సార్లు సిట్ స్టాండ్ అన్నాక దారిలోకి వచ్చారు.
కళ్ళు మూసుకుని ఓంకారం  చేయించి  సిట్ అంది టీచర్.  అల్లరికి కారణం చిన్నదే!బాలకోసం తనపక్కనే లంచ్ బాక్స్ పెట్టిన రమతో జగడా వేసుకుంది సీత."నాప్లేస్ లో ఎందుకు పెట్టావు?"  "సీతా!నీవు పాఠం విననీయకుండా గొణుగుతూ నీకాలితో నన్ను తంతావు." రమజవాబుతో రెచ్చిపోయిన సీత రాద్ధాంతం  తో యుద్ధం మొదలైంది. టీచర్ తెలివిగా సీతను ముందు బెంచీ చివరగాకూచోపెట్టింది. రమ తన చోటు నించి కదలలేదు.ఆరోజు  పాఠంబదులుగా టీచర్ ఇలా చెప్పుకుంటూ పోయారు.
: "చిన్న నిప్పురవ్వ గడ్డివాములో పడితే పల్లె అంతా తగలబడేది పూర్వం.ఇప్పుడు  మన మాట చేత ఏమాత్రం తేడా వచ్చినా మీడియా వలన రాష్ట్రంలో  దేశంలో కల్లోలం చెలరేగుతుంది.ఇక వేసవిలో విద్యుత్ వల్ల షాపింగ్ మాల్స్ బూడిద అవుతాయి. ఎన్ని ఫైరింజన్లు జనం కష్టపడాలో మీరు టి.వి. ద్వారా  తెలుసుకుంటున్నారు. మరి కోపంని ఎలా అదుపులోకి తేవాలి?
ముందు మంచి నీరు తాగండి.లేదా వెంటనే  ఆ గది ఆవ్యక్తిని విడిచి వెళ్లాలి.పచార్లు చేయాలివేగంగా.రఫ్ బుక్ లో  మనభావాలు కోపకారణాలురాయండి. క్లాసులో గొడవజరిగితే టీచర్ కి
చెప్పాలి. లేదా మనం కూచున్న చోటు మార్చాలి. వాకింగ్  పరుగెత్తటంవల్ల కోపం హూష్ కాకి అవుతుంది. కోపం వల్ల మనమెదడులో కొన్ని రసాయనాలు విడుదల అయి మనసు శరీరం కి హాని చేస్తాయి.కోపం తో మనం భయంకరంగా అసహ్యంగా కనపడుతాము.వెంటనే అద్దం లో చూసుకుంటే మంచిది.  ఇంటిలోవారు తిడితే బడికెళ్ళినా పిల్లలు మూడీగా ఉండి పాఠం అర్ధం చేసుకోలేరు.టీచర్ బుజ్జగించి ఒంటరి గా పిలిచి కారణం కనుక్కోవాలి.తల్లి కూడా స్కూల్ లో జరిగిన విషయాలు కబుర్లు చెబుతూ తెలుసు కోవాలి. టీచర్  తోటి పిల్లల వల్ల సమస్య ఉంటే అమ్మ నాన్నలు హెచ్. ఎం. టీచర్ తో మాట్లాడి తెలుసు కోవాలి. రోజూ స్కూల్ డైరీలో పేరెంట్స్ సంతకం పెట్టాలి.ఉద్యోగంచేసే  అమ్మ నాన్న తమమాట వినేస్థితిలో  ఉండరని పిల్లలు అబద్ధాలు చెప్తారు. ఇప్పుడు అన్నీ అపార్ట్మెంట్లు కాబట్టి  ఇరుగుపొరుగు ఆంటీలతో తమభావాలు షేర్ చేసుకునేలా  ఉద్యోగం చేసేవారు  ప్రోత్సహించాలి.కానీ తోటి పిల్లలతో బాగా కొట్లాడే తమసంతానం విషయంలో  శద్ధచూపకపోతే పెద్దలు పిల్లలమధ్య దూరం పెరగటం ఖాయం. తస్మాత్ జాగ్రత్త.
కామెంట్‌లు