చందమామ చిట్టి బాబు (బాల గేయం):-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట

తెప్పల్లో చందమామ దాగి ఉన్నావా 
పప్పులన్నీ తెచ్చి పెట్టి చూస్తున్నావా
ఇక తప్పులేమీ చేయనని చిట్టి బాబు
చేతులేమొ చాపుచుండె చూడమామా

జాలిగల జాబిలమ్మ జాగుచేయక
చిట్టిబాబు చెంతనీవు చేరిపోవా
దాసిన పప్పులన్ని తెచ్చి పెట్టవా
బొజ్జ నిండా చిన్నబాబు తిన్నాకా

వెన్నెల వెలుగులేమొ పంచుకుంటూ
మా చిన్నారి బాబుతో ఆడుకుంటావా
వీచేటి పవనాలతో పాటలే పాడుతూ
పాపాయి ఊయల ఊపిపోతవా

ఊయలుగుతూ జోల పాట వినుకుంటూ
వెన్నెల వెలుగులో చిన్నారి మా బాబు
హాయిగా నిద్రలోకి జారుకున్నాక
చుక్కల్లో నీవేమో చేరిపోతావా

కామెంట్‌లు