సీసమాలిక పద్యం
చెట్ట పట్టాలతో చలగుచున్ యందురు
ఇష్టమొచ్చిన రీతి నిలనదిరుగ,
యీకరోనా వచ్చి యిన్నెలు జూపించి
ప్రజలను వణికించె పాపి వ్యాధి,
ప్రాణ భయము తోడ బంధీగ నింటిలో
కోటీశ్వరుడు నైన కూలి యైన,
గృహనిర్బంధము గృహిణి తో నుంచెను
పిల్లజెల్లలతోడ పెద్ద లంత,
తెలుపుచు నున్నారు తెలిసిన విషయాలు
మసలుకోవలెనని మంచి బాట,
బడులు మూతబడెను పంతుళ్ళు నింటిలో
గుడులు మూతబడెను ఘోరమాయె,
రోడ్డు లన్ని వెలితి రోధించె విధముగన్
వనమును తలపించె వసుధ జూడ,
యెక్కడ జూచినన్ యెవ్వరు లేకను
నిర్మానుష్యమ్ముగ నిద్రిస్తోంది.
తేటగీతి
రాకపోకలు లేకను రైళ్లు బందు,
వాహనాలన్ని నిలిపేసె వ్యాధి కొరకు,
బడుగు జీవుల బ్రతుకంత భారమయ్యె,
నిజము జగములో సందడి నిద్రవోయె.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి