నల్లమల అడవిలో ఓ గుబురైనా మర్రిచెట్టు వుండేది. ఆ చెట్టు పైన రకరకాల పక్షులు జీవిస్తున్నాయి. దాని కింద ఓ ముని జీవనం చేస్తున్నాడు. సమాజ శ్రేయస్సు కోసం, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ చెట్టు కింద తపస్సు చేస్తున్నాడు. అడవిలో దొరికే పండ్లు, కంద మూలాల తింటూ ఆకలి తీర్చుకుంటున్నాడు. చీమకు కూడా హాని తలపెట్టని తత్వం గలవాడు. లోకసంబంధమైన తత్వాలు ఆయన కమ్మగా పాడుతుంటే పక్షులు ఆదమరచి వినేవి.
ఒకరోజు చెట్టుపైన వున్న కాకి ముని నెత్తిమీద రెట్ట వేసింది. మునికి తపోభంగం అయింది. కళ్ళు తెరిచి చూశాడు. కాకి కావుకావుమని అరుస్తు వెళ్లి పోయింది. ముని దాని ఒంక ప్రేమగా చూసాడు. "ఏదో పరమార్ధం లేనిదే ఇలా జరగదు " అనుకుంటూ ప్రశాంతంగా స్నానానికి లేచాడు. అదే సమయంలో ఓ కోడె త్రాచు ముని కూర్చున్న బండ వెనకనుండి బరాబరా వెళ్లిపోయింది. ముని పకపకా నవ్వుతూ "పరమార్ధమంటే ఇదే" అనుకున్నాడు. మనం మంచిగా జీవిస్తే ఆపదలో ఎవరో ఒకరు వచ్చి మనల్ని రక్షిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది కదూ. ఇదే పరమార్ధమంటే.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి