ఎంత కాలం :- డా.. కందేపి రాణీప్రసాద్.

వెతల వలస కూలీల
ఆకలి కేకలకు అంతం లేడు
పడరాని పాట్లు పడి
ప్రాణాలరచేత బట్టుకొని
చివరకు సొంతూళ్ళు చేరినా
ఎక్కువ సేపు నిలవలేదు
ఆ ఆనందాలు!

పనిలేదు, తిండి లేదు
ప్రేమ కన్నా ఆకలి గొప్పది
ఆకల్ని మించిన
శక్తివంతమైనదీ ప్రభావవంతమైనదీ
లేదీ ప్రపంచంలో
ఆకలి ముందు
అన్నీ దిగదుడు పే !

కడుపులో ఆకలిని నకనకలాడే
పేగులు
పొంతూరి కోసం తపించిన
మనసును
కొరక్కు తింటున్నాయి
కొద్దికొద్దిగా!

ఎంతకాలం
కడుపులో కాళ్ళు పెట్టుకుంటాడు
ఎంతకాలం
పొయ్యిలో పిల్లి పడుకుంటుంది
ఎంతకాలం
మాటల్తో పిల్లలను ఊరుకోపెడ్తారు
ఎంతకాలం
అన్నంగిన్నెలో రాళ్ళను ఉడికిస్తారు
ఎంతకాలం! ఎంతకాలం!
కామెంట్‌లు