అప్పుడే పూజ ముగించుకుని దేవుడి గదిలో నుంచి బయటకు వచ్చింది మీనాక్షి. టిఫిన్ రెడీ అయిందా బయటికి వెళ్ళాలి అన్నాడు భర్త కృష్ణమూర్తి ఇదిగోనండి వచ్చేస్తున్నాను అంటూ వేడి వేడి ఉప్మా ప్లేట్ లో పెట్టి తీసుకు వచ్చింది.
కృష్ణమూర్తి ఉప్మా మా నోట్లో పెట్టుకో బోతుండగా ఎవరో వస్తున్నా వస్తున్న చప్పుడు విని పించి తలెత్తి చూశాడు. తన మిత్రుడు సూర్యనారాయణ దిగులు ముఖంతో వస్తున్నాడు భార్యని పిలిచి ఇంకో ప్లేటు ఉప్మా తీసుకురా అని చెప్పాడు.
నేను నేను ఇంటిదగ్గర అ తినే వచ్చాను అన్నాడు సూర్యనారాయణ.
నువ్వు నువ్వు తిన్నది లేనిది నీ ముఖమే చెబుతున్నది లే అయినా పరవాలేదు తినమంటూ ప్లేట్ అందించాడు.
ఇద్దరూ టిఫిన్ తింటం పూర్తికాగానే మీనాక్షి కాఫీ అందిస్తూ అన్నయ్య గారు బాగున్నారా అన్నది.
మౌనంగా ఉన్నాడు సూర్యనారాయణ.
ఏమైనా నా సమస్య వచ్చి పడిందా పరవాలేదు చెప్పమన్నాడు కృష్ణమూర్తి.
నా భార్యకి నాలుగు రోజుల నుంచి జ్వరం తగ్గలేదు హాస్పిటల్ కి తీసుకు వెళ్లాలంటే చేతిలో పైసా లేదు తీరా వెళ్ళాక ఎక్స్రరే స్కానింగ్ అంటూ వైద్యానికి బోలెడు డబ్బు గుంజుతారు ఏం చేయాలో తోచడం లేదు.
ఇప్పుడే రాఘవరావు దగ్గరకి వెళ్లి వస్తున్నాను 4000 సర్దుబాటు చేయమని అడిగాను ఏమన్నాడో తెలుసా.
బొచ్చు కుక్క పిల్లకు గొలుసు కొనాలని వాచ్ మెన్ ని పంపించాడట నిన్ననే అడిగి ఉంటే ఇచ్చేవాడిని అన్నాడు ఏం చేస్తాం నోరు మూసుకుని వచ్చాను మధ్యలో కదా నిన్ను పలకరించి వెళదామని వచ్చాను అన్నాడు.
కృష్ణమూర్తి మధ్య తరగతి కుటుంబం పిల్లల పెళ్లిళ్లు చదువులు ఉద్యోగాలు అన్నీ చేసి నిలదొక్కుకున్నాడు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు వచ్చే పెన్షన్ తోనే పొదుపుగా వస్తాడు ఆ పరిస్థితిలో మిత్రుని చూస్తుంటే జాలేసింది. లోపలికి వెళ్లి భార్య తో మాట్లాడాడు ఏమైనా డబ్బులు ఉంటే సూర్యనారాయణకి ఇవ్వమన్నాడు.
ఎప్పటినుంచో తిరుపతి వెళ్లాలని 4000 దాచాను. ఇప్పుడు ఆ డబ్బు కాస్త ఇస్తే మనం ఎలా వెళ్దాం దేవుడి హుండీలో యాలని మొక్కుకున్నాను అన్నది మీనాక్షి. దేవుడికి కానుకలు బాగానే వస్తాయి హుండీలో డబ్బు వేయకపోతే పాపం రాదు కదా ఈ సారి వెళ్ళినప్పుడు వేయవచ్చు ఒక ప్రాణం నిలబెట్టిన కూడా పుణ్యం వస్తుంది భక్తితో సమర్పించిన తులసి దళం కూడా చాలని గీతలో కృష్ణ భగవానుడు చెప్పలేదా అన్నాడు. మీనాక్షి ఆలోచించి బీరువాలో నుంచి ఆ 4000 తీసుకెళ్లి సూర్యనారాయణ ఇచ్చి వైద్యం చేయించండి. కష్టాల్లో ఉన్న మనిషిని ఆదుకోవడం కన్నా నా పుణ్యం ఎక్కడుంది అని మనసుని సమాధాన పరచుకుంది. సూర్యనారాయణ వస్తాను రా నీలాంటి స్నేహితుడు ఉండబట్టి ఇ ఈ రోజు అవసరానికి ఉపయోగ పడ్డావు అంటూ వెళ్ళిపోయాడు. ఒకరోజు సూర్యనారాయణ వస్తుంటే దారిలో యాక్సిడెంట్ జరిగింది జరిగింది రాఘవరావుకి ఎవరూ పట్టించుకోవడం లేదు అందరూ చూస్తున్నారు కానీ హాస్పిటల్ కి తీసుకు వెళ్దామని ముందుకు రాలేదు వెంటనే సూర్యనారాయణ అంబులెన్స్ పిలిపించి రాఘవరావు హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాడు మరి కొద్ది నిమిషాలు ఆలస్యమైతే ప్రాణాలు దక్కేవి కావన్నారు డాక్టర్లు. వెంటనే వైద్య మొదలుపెట్టారు రాఘవరావు కోలుకునే దాకా అక్కడే ఉన్నాడు సూర్యనారాయణ. ఆరోగ్యం కుదుటపడి ఇంటికి వచ్చాడు రాఘవరావు. సూర్యనారాయణ చేతులు పట్టుకొని నన్ను క్షమించరా నువ్వు ఆ పదవిలో ఉండి డబ్బు సాయం చేయమంటే డబ్బు ఉండి కూడా చేయలేకపోయాను ఈరోజు నీవు నన్ను ప్రాణాలు కాపాడావు ఆ సమయంలో నీవే లేక పోతే నేనే మై పోయేవాడిని. స్నేహానికి విలువ లేకుండా చేశాను. మీలాంటి ఇ స్నేహితుడు ఉండటం చాలా గర్వ కారణం నీ రుణం ఎలా తీర్చుకోగలం నా కళ్ళు తెరిపించారు. నీవు చేసిన సహాయానికి నాకు ఉదయం అయింది. సమయం వచ్చినప్పుడు నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటాను ఇప్పటికీ ఇస్తావు కదూ అంటూ చేతులు పట్టుకున్నాడు. స్నేహానికి క్షమాపణలు ఏమిటి అవసరాలు వస్తూ పోతూ ఉంటాయి. ఎవరో ఒకరు తీరుస్తూనే ఉంటారు పరవాలేదులే మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ స్నేహితుడికి ఓదార్పు మాటలు చెప్పాడు సూర్యనారాయణ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి