నిరాడంబరత....అచ్యుతుని రాజ్యశ్రీ


 పైపైమెరుగులు పటాటోపంతో కొన్నాళ్లవరకు మనం తెలివితేటలున్న  గొప్ప వారిగా చెలామణి కావచ్చు. మెరిసేదంతా బంగారం కాదు. పైనపటారం లోన లొటారంతో కొంత మంది ఉంటే సీదాసాదాగా అమాయకంగా కొందరు కనిపిస్తారు. మనఋషులు ఎలా జీవించారో మనకు తెలుసు. ఇది నిజంగా జరిగిన సంఘటన.     బోస్టన్ లో దిగిన  ఆదంపతులు చాలా సాదాసీదా  దుస్తుల్లో రైలు ప్రయాణం లో అలసిపోయినా తాము వచ్చినపని కోసం సరాసరి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళారు.అక్కడ సెక్రెటరీ వీరిని చూసి మొహం చిట్లించి "మీలాంటి పల్లెటూరి బైతులను మాప్రెసిడెంట్ కలవడు.మీకు ఆయనతో ఏంపని?"గద్దించాడు. "మేము ఆయనను కలిసి తీరాలి."  "ఏం మాయూనివర్శిటీ బందిలదొడ్డి గా కనపడుతోందా?" జవాబు ఇవ్వలేదువారు. గంటలకొద్దీ వేచి ఉంటే విసుక్కుంటూ సెక్రెటరీ  ఈసమాచారం ప్రెసిడెంటు కి అందించాడు.ఆపై ఆదంపతులను లోపలకి పంపాఢు.వారి అవతారం చూస్తూనే మొహంచిట్లించి "ఏం కావాలి?"అన్న  ప్రెసిడెంటు తోఆమె అంది"సర్!మా అబ్బాయి  ఇక్కడే  ఒక ఏడాది చదివాడు.మీయూనివర్శిటీ అంటే వాడికి ఎంతో ప్రేమ అభిమానం. ఏడాది క్రితం  యాక్సిడెంట్ లో చనిపోయాడు." ఆతల్లి  గొంతు బొంగురుపోయింది. తండ్రి అందుకున్నాడు 'వాడి స్మృతిగా వాడి విగ్రహం పెట్టాలి  అని మా ఆలోచన. "  "మీఅబ్బాయి విగ్రహం పెట్టడం కుదరదు.ఇదేమన్నా శ్మశానవాటిక అనుకుంటున్నారా?"అతని మాటలు వారిని బాగా గాయపరిచాయి. "పోనీ ఒక భవంతి కట్టిస్తాం " "మాభవనాలవిలువ ఏడున్నరమిలియన్ల డాలర్లు పై మాటే." వారి అవతారాలు అలాగే ఉన్నాయి మరి.అంతే ఆదంపతులు  అక్కడినుంచి  బయటపడ్డారు. అంతే తామే ఒక యూనివర్సిటీ ని కట్టించారు.అలా  స్టాన్ ఫోర్డ్  యూనివర్సిటీ నెలకొల్పారు.అమెరికాలో అది పేరున్న  యూనివర్సిటీ.

కామెంట్‌లు