భారతజాతిరత్నం (మణిపూసలు):-*మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట*

 కలాంనేతకు జేజేలు
శాస్త్రవేత్తకు జేజేలు 
క్షిఫణిధృవతారయైన
మహా ఘణునికి జేజేలు
భరతదేశ జాతిరత్నం 
మేధావులలొమేలిముత్యం 
మచ్చ లేని స్వచ్ఛమైన
మానవులలో మణిరత్నం
పడవను నడిపించినోడు
 పత్రికలను పంచినాడు
నిరంతరసాధనజేసి
భరతరత్న పొందినాడు
భారతమ్మ ఒడియందున
గగన శిఖర అంచుపైన
ప్రతిభ ప్రగతి పథమునిలిపి
వేగుచుక్కయైవెలిగెను
కలలు యెన్నొకనమన్నడు
కృషి ఎంతో చేయమన్నడు
సమయపాలనమ్ముజేసి
కలలసాధించమన్నడు
            

కామెంట్‌లు