పసి మనసులు.:-తాటి కోల పద్మావతి గుంటూరు.


 స్కూల్లో టీచర్ పాఠం చెబుతుంటే కార్తీక్ వినకుండా ఎటో దిక్కులు చూస్తున్నాడు.

లెసన్ చెప్పటం పూర్తి కాగానే విద్యార్థుల్ని ఒక్కొక్కరిని పిలిచి ఈ ప్రశ్నలు వేసింది.

కొంతమంది సరైన సమాధానాలు చెప్పారు కార్తీక్ అని చెప్పమని అని అడిగింది. ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. పాఠం వినకుండా ఏం చేస్తున్నావు అంటూ కోప్పడింది. సాయంత్రం ఇంటికి వెళ్ళాక పుస్తకాలు ముందర వేసుకొని చదువుకోకుండా బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. తండ్రి గోపాలం ఆఫీస్ నుంచి వస్తూనే కొడుకు చదవడం లేదని పడ్డాడు. డ్రాయింగ్ వేయటం చూసి చదువుకో మంటే బొమ్మలు గీస్తున్నావా ఈసారి మార్పులు తగ్గితే నిన్ను ఇంట్లో ఉంచేది లేదు ఎక్కడో దూరంగా హాస్టల్లో నేర్పిస్తాను అంటూ ఆ పేపర్స్ తీసుకుని మంచి పడేసాడు ఇంకోసారి ఇలాంటి పనికిమాలిన పనులు అంటే ఊరుకోను అంటూ వీపుమీద రెండు దెబ్బలు వేసాడు. వంట ఇంట్లో నుంచి భార్య సుమతి వచ్చి ఎందుకండీ వాడిని అలా కొట్టి ఏడిపిస్తారు అంది. నువ్వలా వాడిని వెనకేసుకుని రాబట్టే చెప్పిన మాట వినకుండా తయారయ్యాడు స్కూల్లో బాగా చదవడం లేదని వాళ్ళ టీచర్ ఫోన్ చేసి చెప్పింది. నా తల కొట్టేసి నట్లు అనిపించింది ఈ సారి పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే ఊరుకునేది లేదు ఏం చేస్తావో నీ ఇష్టం అంటూ భార్య మీద అ విరుచుకుపడ్డారు. కార్తీక్ ఏడుస్తూ తల్లిని చుట్టేసుకున్నాడు ఊరుకో అమ్మ నాన్న గారు ఇప్పుడు ఏమన్నారు నిన్ను బాగా ఉన్నారు అంతేగా మార్కులు బాగా తెచ్చుకో అంటూ బుజ్జగించింది. నాకు డ్రాయింగ్ వేయడం చాలా ఇష్టం ఆగస్టు 15 కి మా స్కూల్లో డ్రాయింగ్ పోటీలు పెట్టారు ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్న వాళ్ళకి బహుమతులు ఉంటాయి అందుకే నేను ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నాడు. అలాగైతే మీ నాన్న చూడకుండా ప్రాక్టీస్ వేసుకో ముందు చదువుకో ఆ తర్వాత డ్రాయింగ్ వేయటం నేర్చుకో అంటూ చెప్పింది కార్తీక్ పరీక్షలు దగ్గర పడ్డాయి బాగా చదివినా మార్పులు రాలేదు తండ్రి కొడతాడని భయంతో జ్వరం తెచ్చుకున్నాడు హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు డాడీ కొట్టొద్దు డాడీ అంటూ కలవరించే వాడు మందులు వాడినా జ్వరం తగ్గలేదు. చూశారా పిల్లవాడిని భయపెట్టడం తో జ్వరం తెచ్చుకున్నాడు అన్నది సుమతి. తండ్రి గోపాలం కోప్పడనని మాట ఇచ్చాను నిదానంగా జ్వరం తగ్గు ముఖం పట్టింది. ఖాళీ సమయంలో డ్రాయింగ్ బాగా వేసే వాడు. ఆగస్టు 15 రానే వచ్చింది ఆరోజు పిల్లలందరికీ డ్రాయింగ్ పోటీలు పెట్టారు అందరిలోకి కార్తీక్ ఫస్ట్ వచ్చాడు . స్టేజి మీదకు పిలిచి ప్రధమ బహుమతిని అందించారు తల్లిదండ్రుల్ని కూడా అందరికీ పరిచయం చేసి పిల్లలకు ఇష్టమైన విద్య నేర్పిస్తే ముందు ముందు గొప్పగా రాణిస్తారు. ఎవరికి ఇష్టమైన విద్య వాళ్లకు నేర్పించాలి అప్పుడే వాళ్ళ భవిష్యత్తుకు పునాదులు వేసిన వాళ్లు అవుతారు ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వాళ్లకు ఇస్తే అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతారు. మీ వంతు కృషిని మీరు అందించిన అప్పుడే పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసిన వాళ్ళవుతారు అంటూ చెప్పారు ‌ చప్పట్లు మార్మోగాయి కార్తీక్ తల్లిదండ్రులిద్దరూ దగ్గరకు తీసుకొని ప్రేమానురాగాలు కురిపించారు చిన్నప్పటి కార్తీక్ పెద్దయ్యాక బొమ్మలు గీయడంలో ఆరితేరాడు.


కామెంట్‌లు