దిక్కులు ఎన్నే అమ్మమ్మా
దిక్కులు నాలుగె పాపాయీ
మూలలు ఎన్నే అమ్మమ్మా
మూలలు నాలుగె పాపాయీ
దిక్కులు పేరులు ఏమమ్మా
తూరుపు పడమర ఉత్తరం దక్షిణం
మూలల పేరులు ఏమమ్మా
ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయవ్యం
గ్రహములు ఎన్నే అమ్మమ్మా
గ్రహములు తొమ్మిదె పాపాయిా
చుక్కలు యెన్నే అమ్మమ్మా
ఇరవై ఏడే పాపాయీ
చంద్రుడు ఎవరే అమ్మా
చుక్కలరాజే పాపాయీ
సూర్యుడు ఎవరేఅమ్మమ్మా
జగతికి వేలుపు పాపాయీ
సాంఘిక శాస్ర్రం చదువమ్మా
సకలము తెలియును మాయమ్మా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి