పూర్వం ఒకూర్లో ఓ అన్యోన్య దంపతులు వుండేవారు. వారు ఎంతో ప్రేమగా వుండేవారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వారికి సంతానం లేదు. తీర్థయాత్రలు చేశారు. వ్రతాలు చేశారు. అయినా సంతాన భాగ్యం కలగలేదు. కాశికివెళ్లి విశ్వనాధుని మొక్కుంటే సంతానం కలుగుతుందని ఎవరో చెబితే, కాశీకి వెళ్లారు. గంగలో మునిగారు. దేవునికి మొక్కారు. అక్కడున్న సాధువులను కలిశారు. "నాయనా! మీరు కోరిన కోరిక నెరవేరాలంటే భర్తకు అత్యంత ఇష్టమైనది ఏదైనా ఉంటే అది ఇక్కడ గంగలో వదిలేసి వెళ్లండి" అన్నారు అక్కడ ఉన్న సాధువులు. "తనకు అత్యంత ఇష్టమైంది ఏమిటి? ఏమి వదిలేసి వెళ్ళాలి" అని ఆలోచిస్తున్నాడు భర్త. "సరే మీకిష్టమైనది ఏదో వదిలేయండి" అని తొందరపెట్టింది భార్య. భర్త వులకటంలేదు. పలకటంలేదు. "త్వరగా చెప్పండి మీకు ఇష్టమైనదేదో?" అంది భార్య. చెప్పటానికి భర్త సంకోచిస్తున్నాడు భార్యవంక దీనంగా చూస్తూ..."నాకు ఇష్టమైనది నీవేనే. నిన్ను వదిలేసిపోతే మనకు సంతానం ఎలా కలుగుతుంది?" అని మనసులో మాట చెప్పాడు భర్త. "వ్వా" అని నోరు తెరిచింది భార్య.
ఇష్టమైనది (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి