కవితావనం --చిమ్నీలు (ప్రక్రియ ):---ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
భావనల విరితోట 
కవిత్వం పరిమళం 
ఉల్లాసమగు బాట 
జీవితమయె  సరళం !

లోపo చూపించకు 
సాగుము  సవరించుకు 
బ్రతుకులో  నటించకు
ఎక్కువ ఆశించకు !

చెప్పినవి ఆచరణ 
చూపేలా యత్నించు 
చేసిందిక వివరణ 
చెప్పి మరి  మెప్పించు!

ఒకే తీగ పువ్వులు 
ఆప్యాయతకు సిరులు 
మరువకుము  మూలాలు 
  మమత తోబుట్టువులు !


కామెంట్‌లు