నా ధైర్యం నాన్న ..సమ్మోహనములు:- ఉమా మహేశ్వరీ
నీవంటే ధైర్యం
ధైర్యం నా శౌర్యం
శౌర్యం నేర్పించు నాన్న మనకు మహేశ్వరి 

నువు నిత్య శ్రామికుడు
శ్రమ తెలియని బాధ్యుడు
బాధ్యతలలోని భానిస నాన్న మహేశ్వరి

పసితనంలో మురిసి
మురిసి సంతుని చూసి
చూస్తూనే మురిసిపోయేవుగ మహేశ్వరి 

ఎపుడు విశ్రమించక
ఇక శ్రమనే అనక
ఎల్లపుడు మనకై కష్టపడును మహేశ్వరి 

నీవు నా నమ్మకం
నమ్మిన దార్శనికం
దారి చూపు పెన్నిధివి నీవే మహేశ్వరి 

నడక నేర్పావుగా
నేర్పి నిలిపావుగా
నిలిపి నీవే మురిసావు కదా మహేశ్వరి 

నేనే నీ లోకము
లోకము భవితవ్యము
భవితంత బంగారం చేయును మహేశ్వరి 


కామెంట్‌లు