*కరుణామయి*(గేయకథ)[రెండవభాగము]:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 5)
అటుచూసిన టీచరపుడు
"లోనకురా" అని పిలిచెను
విషయమేమిటని పాపను
అనునయముగ అడిగెనపుడు!
6)
టీచరుగారూ! నేనండీ
త్వరత్వరగా రోజులాగె
బడికి వస్తు ఉన్నానండీ
దారిలోన చూశానండీ!
7)
ఒక ముదుసలి వాడండీ
జ్వరపడిన వాడండీ
బాధపడే వాడండీ
తోడులేని వాడండీ!
8)
దారిలోన పోయేవారు
అంతా ఆ ముసలివాడిని
చూసి వెళుతున్నారె గాని
పట్టించుకొన లేదండీ!!
(సశేషం)

కామెంట్‌లు