అందాల రాణిని జూడు
బృందావనం లో నేడు
చందమామ మోమును
అందముగా దాచె చూడు
సలువ చీర ఎర్ర అంచు
ఎర్రరవిక ఒంటి కంచు
చూడ ముచ్చట గాను
అమే నేమొ పలుక రించు
పూల చీర కోరి గట్టి
కొప్పు లోన పూలు బెట్టి
వయ్యారి చూపు తోడ
కోమలాంగి బాటవట్టి
ఊరువాడ దాటి నాది
గుడికి ఆమె చేరి నాది
పూలుచూసి రామచిలుక
కిలకిలమని పలికి నాది
వీరు వారు చూసి నారు
అమే పేరు అడిగినవారు
సుందరని చెప్పినాది
చీర చూసి మురిసినారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి