అది ఊరు మధ్యలో ఉన్న దేవాలయం. ఒకరోజు గుడిలో పూజలు ఘనంగా జరుగు తున్నాయి. భక్తులు పూలు, పండ్లు సమర్పించు కుంటున్నారు. పూజారి శఠగోపం నెత్తిపై పెట్టి దీవిస్తున్నాడు. అందరూ భక్తి పారవశ్యంలో వున్నారు. అప్పుడే గుడి ప్రాంగణంలోని పుట్టలో, బయటకు రాబోతున్న పాముని చూసింది ఓ భక్తురాలు. ఆ పాము పుట్టలోనుంచి బయటకు పోవటానికి ప్రయత్నం చేస్తోంది.
"నాగరాజా!నాగరాజా!!" అంటూ పెద్దగా అరిచింది భక్తురాలు. జనం పొగయ్యారు. జనం అరుపులకు భయంతో పాము పుట్టలోకి వెళ్ళింది. అందరిలో భక్తి పెరిగింది. గుడిలోకి నాగరాజు వచ్చాడంటూ ఊరంతా ప్రచారం చేశారు. ఎప్పుడూ గుడి ముఖం చూడని అమ్మలక్కలు కూడా వచ్చారు. వారు తెచ్చిన పాలు పుట్టలో పోశారు. గుడ్లు పుట్టలో కుక్కారు. నాగరాజు బయటకు వస్తే చూడాలని ఆశగా ఎదురు చూస్తూ వున్నారు. ఎంతకూ నాగరాజు బయటకు రాలేదు. చూసి చూసి భక్తులు వెళ్లిపోయారు. మూడు రోజుల తరువాత గుడి ప్రాంగణమంతా ఒకటే కంపు. అది పాము చచ్చిన వాసన.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి