కొడుకు కోడలు ఆఫీసులకు పిల్లలు స్కూలుకి వెళ్లిపోయారు.
ఇంటి పనంతా పూర్తిచేసుకుని టీవీ ముందు కూర్చుంది అన్నపూర్ణ. పోస్ట్ అన్న కేక తో తలుపు తీసి చూసింది. అప్పటికే పోస్ట్ మాన్ కవరు గడప ముందు పడేసి వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో ఉత్తరాలు ఎవరు రాసి ఉంటారని అడ్రస్ చూసింది. మరింత ఆశ్చర్యం వేసింది అని తన భర్త దగ్గరనుంచి వచ్చింది. తన గదిలోకి వెళ్ళి కవరు చింపి చదవటం మొదలు పెట్టింది. పూర్ణ ఎలా ఉన్నావు ఎందుకు నిన్ను ఎందుకో నిన్ను డాల్ అనిపిస్తున్నది నువ్వు వెళ్లి మూడు నెలలు అయింది ఇదిగో వస్తా అంటావు. నువ్వు త్వరగా వస్తావని ఉత్తరం రాస్తున్నాను ఇంతకీ ఈ ఉత్తరం ఎందుకు రాశాను అనుకుంటున్నావా. ఫోన్ లో కాసేపు మాట్లాడుకుంటే వాటిని మర్చిపోతాం ఉత్తరం అయితే చదువుకొని దాచి పెట్టుకోవచ్చు నాకు ఈ ఆలోచన రావటానికి కారణం నువ్వే. చెప్పమంటావా మన మన పెళ్లి అయిన కొత్తలో నేను మైసూరు ట్రైనింగ్ కి వెళ్లాను నన్ను వదిలేయ్ నువ్వు ఉండలేక పోయావు ఇంట్లో అంతా నీకు కొత్త మా అమ్మ నిన్ను ఎంత బాగా చూసుకున్నా నువ్వు మాత్రం అన్నం తినకుండా బెంగ పెట్టుకొని చిక్కి పోయావు. అప్పుడు వ్రాసిన ఉత్తరం ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాను అదేమిటో చెప్పనా.. మీరు ఎలా ఉన్నారు వేలకు తింటున్నారా మీ ఆరోగ్యం జాగ్రత్త మిమ్మల్ని చూడకుండా ఉండలేక పోతున్నాను. రాత్రివేళ మీరే కలలోకి వస్తున్నారు ఎవరైనా ఆడపిల్లలు కనబడితే వాళ్ల వైపు చూడకండి నేను పక్కన లేను కదా అని పరిచయాలు పెంచుకునే రు. అయినా నా మీరు అలాంటి వారు కాదని నాకు తెలుసు లెండి ఏమిటో పిచ్చి దాన్ని ఇలా రాయవచ్చా లేదు నాకు తెలియదు ఏమైనా నా తప్పుగా రాస్తే నన్ను క్షమించండి ఇట్లు మీ పూర్ణ. ఇప్పుడు గుర్తుకొచ్చిందా నువ్వు రాసిన ఉత్తరం. నీ ఉత్తరం చదువుకొని బలే నవ్వుకొన్నాను అనుకో నాలుగు రోజుల కిందట పెట్టే సర్దుతుంటే నువ్వు రాసిన ఉత్తరం బయటపడింది నీకు గుర్తు చేద్దామని రాస్తున్నాను ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు ఏమో ఎప్పుడు చూసినా పిల్లలు పిల్లలంటూ కొడుకు దగ్గరకి కూతురు దగ్గరికి వాళ్ళ అవసరాల కోసం పిలవగానే వెళ్తావు త్వరగా రావాలి వేళకు తింటున్నావా ఇంటి పనులలో మునిగిపోయి తినటం మానేయ కు అన్నట్లు రాయటం మరిచాను మన పెరట్లో జాజిపూలు బాగా వీరా పూస్తున్నాయి. తెల్లవారేసరికి రాలిపోతున్నాయి నువ్వుంటే వాటిని పూజకి ఉపయోగించే దానివి పూలు కూడా నీకోసం ఎదురు చూస్తున్నాయి ఈ ఉత్తరం మన జ్ఞాపకాలు నెమరు వేసుకోవటానికి రాస్తున్నాను రేపే బయలుదేరి వస్తావ్ అనుకుంటాను స్టేషన్ దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇట్లు మీ నివాస్. ఉత్తరం చదవటం పూర్తికాగానే భర్తను చూడాలనే ఆత్రం గా ఉంది మరునాడే ప్రయాణానికి సిద్ధమైంది రైలు దిగగానే శ్రీనివాసరావు ఎదురు చూస్తూ నిలబడ్డాడు. ఆ ముఖంలో చెరగని చిరునవ్వు చూసి తనతో పాటు తెచ్చుకున్న ఉత్తరాన్ని భద్రంగా దాచుకొని భర్త వెంట ఇంటి వైపు అడుగులు వేసింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి