బామ్మ బంగారం:- సత్యవాణి కుంటముక్కుల

మన బామ్మ బంగారం/
మన ఇంటికి ఆమే సింగారం/
మన మారాములు తీరుస్తుంది/
గారాబం బాగా చేస్తుంది/
అప్పచ్చులు ఎన్నో
 తినిపిస్తుంది/
తప్పొప్పులు మనకెన్నో
 చెపుతుంది/
 
అమ్మానాన్నలు 
 కొట్టొస్తే/
అడ్డంగా తానొస్తుంది/
ఒరులెవరైనా
 మననొకమాటంటే/
ఒప్పను నేనని అంటుంది/
కమ్మని కథలే కాకుండా/
కబురులతో మనల్ని
 మురిపిస్తుంది/
ఆప్యాయత ఎంతో చూపిస్తూ/
మన తిక్కలు అన్నీ
 తీరుస్తుంది/
బామ్మలు యిటుండడమంటే/
భాగ్య రేఖ కలిగుండటమే/
బామ్మలు ఇంటుంటేచాలు
భాగ్యరాశులింటున్నట్లే/
బాలల నేస్తాలు బామ్మలు
 అమ్మమ్మలూ/
మన భావిని దిద్దే/
 గురువులువారు/
ఋణపడాలి బామ్మకులకు 
అమ్మమ్మలకూ/
ఋణం తీర్చుకోవాలేగానీ/
రణం చేయకూడదు వారితో /
బాలలూ మనమెపుడూ/
అలుసు చేయకూడదు వారిని
ఆదరణెంతో చూపాలి/
  
                   
కామెంట్‌లు